SGSTV NEWS online
Andhra PradeshCrime

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!



సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన కృష్ణలంక CI నాగరాజును సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న బృందం అక్కడే నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లింది.



గత నాలుగైదు రోజులుగా తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజును తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం సింగ్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అయితే ఆయన్న అరెస్ట్ చేసే సమయంలో అక్కడ హైటెన్షన్ వాతావరణ చోటు చేసుకుంది.


సీఐ నాగరాజును అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను నాగరాజు మద్దతుదార్లు, స్థానికులను అడ్డుకున్నారు. ఆయన్న అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ పోలీసులకు అడ్డుతగిలారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు నాగరాజు ఇంట్లోకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ముందు జాగ్రత్తగా ఆ ఏరియాలో సెక్యూరిటీని కూడా పెంచారు పోలీసులు.


సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో తల్లి చేసిన కంప్లైంట్‌ ఆధారంగా ఈకేసులో BNS యాక్ట్‌లోని సెక్షన్‌ 103(1), సెక్షన్‌ 127(4), సెక్షన్‌ 127(6) సెక్షన్లను నమోదు చేశారు పోలీసులు. దీనిలో మొదటిది సెక్షన్‌ 103(1) – అంటే ఇది హత్య కేసు. దీని ఫలితం జీవితఖైదు. ఇక మరో సెక్షన్‌ 127(4) – ఒక వ్యక్తిని 10 రోజుల కన్నా ఎక్కువ అక్రమంగా నిర్బంధిస్తే ఈ సెక్షన్‌ను నమోదు చేస్తారు. నేరం రుజువు అయితే.. 5ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.  ఇక సెక్షన్‌ 127(6) – అంటే.. ఎవరినైనా ఎక్కడ బంధించారో బయటికి తెలియకుండా, కుటుంబానికి లేదా పబ్లిక్ సర్వెంట్‌కు తెలియకుండా దాచిపెట్టి నిర్బంధిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీనికి సాధారణంగా అదనంగా 3 సంవత్సరాల వరకు జైలు + జరిమానా పడే అవకాశం ఉంటుంది.


క్లుప్లంగా.. FIRలో ఈ సెక్షన్లు ఉంటే, ఆరోపణ ఏంటంటే.. ఒక వ్యక్తిని 10 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించి, ఆ విషయం బయటకు తెలియకుండా దాచి ఉంచడమే కాకుండా, చివరకు ఆ వ్యక్తిని హత్య చేశారన్న కోణంలో కేసు నమోదు చేసినట్టు అర్థం.

అయితే సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో మొదట్నుంచి నాగరాజు పాత్రపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాయికృష్ణ తల్లి కూడా అప్పుడు కృష్ణలంక CIగా ఉన్న నాగరాజే తన కొడుకును టార్చర్‌ చేశారని ఆరోపించారు. కొడుకు ఆచూకీ కోసం ఆమె హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసి హైకోర్టుకు కూడా వెళ్లారు. వివాదం రోజురోజుకూ పెద్దదవుతూ ఉండడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. చివరికి ఇప్పుడు సిట్‌ విచారణలో కొన్ని కీలక వివరాలు బయటకు రావడంతో నాగరాజును అరెస్టు చేసి తీసుకెళ్లారు సిట్‌ అధికారులు.

Also read

Related posts