SGSTV NEWS online
Astro TipsSpiritual

బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రాజయోగం కలుగుతాయట!

 

Evening Deepam Benefits: సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య దీపం వెలిగించడం ఎందుకు ప్రత్యేకమో తెలుసా? శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో దీపారాధన చేయడం వల్ల రాజయోగం, లక్ష్మీ కటాక్షం, కుటుంబ సౌఖ్యం లభిస్తాయని నమ్మకం. అలాగే వారంలోని ప్రతి రోజు దీపం వెలిగించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాల గురించి కూడా తెలుసుకోండి.


హిందూ సంప్రదాయంలో దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి దీపం వెలిగించడం ఎంత శుభప్రదమో, సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించడం కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. ఈ రెండు సమయాలు దేవుని ఆరాధనకు అత్యంత అనుకూలమైనవిగా చెప్పబడాయి.


సంధ్యా సమయంలో దీపం వెలిగించడం ఎందుకు ప్రత్యేకం?

సూర్యాస్తమయం సమీపించే సంధ్యా కాలం ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉండే సమయంగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఇంట్లో లేదా పూజా గదిలో దీపం వెలిగించడం శాస్త్రోక్తమైన ఆచారంగా పేర్కొంటారు.



ఈ సమయంలో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి, దుష్ప్రభావాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు.



మూడు దీపాలతో పూజ చేస్తే రాజయోగం
ప్రతిరోజూ సాయంత్రం పూజా గదిలో మూడు దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే రాజయోగం కలుగుతుందని శాస్త్ర విశ్వాసం. క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగి, శుభఫలితాలు కలగడం ప్రారంభమవుతుందని చెబుతారు.

పసుపు వత్తి దీపం ప్రత్యేకత
సాయంత్రం వేళల్లో పసుపు పూసిన వత్తితో దీపం వెలిగించడం మరింత శుభప్రదంగా భావిస్తారు. పసుపుకు పవిత్రత, మంగళకరతకు ప్రతీకగా గుర్తింపు ఉంది.

సాధారణ పత్తి వత్తికి పసుపు రాసి ఆరబెట్టి, ఆ తర్వాత దీపంలో ఉపయోగిస్తే బాధలు, కష్టాలు తగ్గుతాయని విశ్వాసం. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఐదు పసుపు వత్తులతో దీపం వెలిగిస్తే విశేషమైన శుభఫలితాలు లభిస్తాయని చెబుతారు.

వారంలో ఏ రోజు దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు?

👉  ఆదివారం: దీపారాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి, కుటుంబ పెద్దలతో విభేదాలు తొలగుతాయని నమ్మకం.

👉  సోమవారం: మనశ్శాంతి పెరిగి, భయం, ఆందోళన, చంచలత్వం వంటి సమస్యలు తగ్గుతాయని విశ్వాసం.

👉  మంగళవారం: వివాహ ఆటంకాలు, కుజ దోష ప్రభావాలు తగ్గి కుటుంబంలో సంతోషం పెరుగుతుందని చెబుతారు.

👉  బుధవారం: విద్యలో ఏకాగ్రత పెరిగి, మతిమరుపు, చదువుపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు.

👉  గురువారం: వివాహ సంబంధ ఆటంకాలు తొలగి, సంతాన సౌభాగ్యం, కుటుంబ సంతోషం కలుగుతుందని విశ్వాసం.

👉  శుక్రవారం: లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, అప్పుల బాధలు తగ్గి, దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుందని చెబుతారు.

👉  శనివారం: దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, వృత్తి స్థిరత్వం, శని, రాహు సంబంధిత దోషాల ప్రభావం తగ్గుతుందని నమ్మకం.

దీపలక్ష్మీ ప్రార్థన

హిందూ సంప్రదాయం ప్రకారం వెలిగించిన దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని విశ్వసిస్తారు. అందుకే దీపం వెలిగించిన అనంతరం భక్తితో ‘దీపలక్ష్మీ నమో నమః’ అని జపిస్తూ ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు.

Related posts