Amavasya Horoscope: జూన్ 15న సంభవించనున్న అమావాస్యకు జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వృషభ రాశిలో రవి, చంద్రులు కలవడంతో పాటు చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం ఈ అమావాస్య విశేషంగా మారుస్తోంది. జూన్ 14, 15, 16 తేదీల్లో దీని ప్రభావం బలంగా ఉండనుండగా, తదుపరి పౌర్ణమి వరకు కొన్ని రాశుల వారికి ఊహించని శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ధనయోగాలు, అధికారయోగాలు పట్టే ఛాన్స్ ఉంది.
June 2026 Amavasya Horoscope: వృషభ రాశిలో రవి, చంద్రులు కలవడం వల్ల ఈ నెల(జూన్) 15న సంభవించబోయే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. అమావాస్య రోజున చంద్రుడు క్షీణ దశలో కాకుండా ఉచ్ఛ స్థితిలో ఉండడం విశేషం. ఈ అమావాస్య ప్రభావం 14, 15, 16 తేదీల్లో కొనసాగుతుంది. ఈ మూడు రోజుల అమా వాస్య ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో పదిహేను రోజుల పాటు, అంటే తదుపరి పౌర్ణమి వరకు ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలతో పాటు అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
ఏయే రాశుల వారిపై ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం..
మేషం: ఈ రాశికి ధన స్థానంలో రవి, చంద్రులు కలిసి అమావాస్య ఏర్పడడం వల్ల రాజపూజ్యాలు, రాజ యోగాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధిలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్య మైన అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో రవితో కలవడం వల్ల ఈ రాశివారి జీవితంలో ఒకటికి రెండు సార్లు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసు కున్న డబ్బు చేతికి అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు ధనాధిపతి రవితో కలవడం వల్ల వ్యక్తిగత జీవితం బాగా పురోగతి చెందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోవడం, విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, విదేశీ సంబంధాలు కుద రడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి లాభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది.
కన్య: భాగ్య స్థానంలో ఉచ్ఛ చంద్రుడు, రవి కలవడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదాలు, వేతనాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాజయోగకారక గ్రహాలైన రవి, చంద్రులు కలవడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.
మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, చంద్రుల కలయిక వల్ల ఈ నెలంతా ఈ రాశివారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది.
Also read
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!
- మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం!
- పోలీస్ స్టేషన్లో యువకుడి హైడ్రామా.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరుగులు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు










