2026 సంవత్సరంలో ఇప్పటికే మొదటి చంద్రగ్రహణం పూరైన విషయం తెలిసిందే. అయితే త్వరలో రెండో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే ఈ సంవత్సరంలో రెండో చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది భారత్లో కనిపిస్తుందా; రాఖీ పండుగ పై దీని ప్రభావం ఉంటుందా? ఇప్పుడు చూద్దాం.
చంద్ర గ్రహణం అనేది సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి ఒకే సరళ రేఖలో అడ్డు వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు మసకగా కనిపించడం, కనిపించకుండా పోవడం జరుగుతుంది. దీనిని చంద్ర గ్రహం అంటారు. అయితే ప్రతి సంవత్సరం ఈ గ్రహణాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికంగా వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఇక ఈ 2026లో రెండో సూర్యగ్రహణం ఆగస్టు 28 పౌర్ణమి తిథి,రక్షాబంధన్ రోజే ఏర్పడనుంది. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. అయితే చాలా మంది రాఖీ పౌర్ణమి రోజే చంద్ర గ్రహణం ఏర్పడటం వలన అసలు రాఖీ కట్టుకోవచ్చా? పండుగపై గ్రహణ ప్రభావం ఉంటుందా? అనే చర్చ కొనసాగుతుంటుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారత్లో కనిపించడదంట.

ఈ సంవత్సరం ఏర్పడే చివరి సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో కనిపించదు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలన మన దేవానికి సూతక కాలం వర్తించదు. ఇది ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో కనిపిస్తుందంట.

భారత దేశంలో చంద్రగ్రహణం కనిపించనందున, రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం విషయంలో కూడా ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు, ఆధ్యాత్మికంగా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు పండితులు. హిందూ సంప్రదాయాల ప్రకారం, మన దేశంలో గ్రహణం కనిపించదు కాట్టి,గ్రహణ సూతక నియమాలు కానీ, పూజా నిరోధాలు కానీ మనకు వర్తించవు కాబట్టి, ఆనందంగా ఎలాంటి టెన్షన్ లేకుండా రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చునంట.

Also read
- భర్త కళ్లముందే ఘోరం.. సంతకు వెళ్లి వస్తుండగా అడ్డుకుని.. మహిళ గొంతు కోసి కిరాతకం.. !
- రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
- June 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆర్థికంగా గోల్డెన్ టైమ్.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Astrology: జూన్లో గ్రహాల మహా సంచారం.. ఈ 5 రాశుల వారికి ఊహించని అదృష్టం, ధనలాభం ఖాయం!
- Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తున్నాయా? అంతా శుభమే!





