వార ఫలాలు (మే 31-జూన్ 6, 20260: మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయం విషయంలో వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. మిథున రాశి వారు పట్టుదలగా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు వారమంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబపరంగా చిన్నాచితకా సమస్యలున్నప్పటికీ తేలికగా చక్కబెడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. బంధువుల నుంచి మధ్య మధ్య విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. దాంపత్యంలో అన్యోన్యతకు లోటుండదు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయం విషయంలో వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులు, ఇష్టమైన మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో అన్నిటినీ పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందు తారు. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆస్తిపాస్తుల వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. పట్టుదలగా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద వారమంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ నమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉండవచ్చు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మదుపులు, పెట్టుబడులు లాభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో కొన్ని అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా అధికారుల నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ, తిప్పట పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం ఎక్కువై, అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇష్ట మైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో పంతాలు తగ్గించడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా సాఫీగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసి లాభం పొందుతారు. ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకోకుండా మంచి హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. పోటీదార్ల సమస్య నుంచి చాలావరకు బయటపడతారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరంగా సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వారమంతా విజయాలు, సాఫల్యాలతో గడిచిపోతుంది. ముఖ్యంగా కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు వింటారు. అనుకోకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అనారోగ్య సమస్యల్ని తేలికగా అధిగమిస్తారు. ఆటంకాలున్నా ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెడతారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గురు బలం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సాయం చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడంతో పాటు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ధన, కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా రాబడి పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం, ఉద్యోగం, విదేశీయానం వంటి విషయాల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కొన్ని ముఖ్య మైన సమస్యలు, కష్టనష్టాల నుంచి బయటపడి పురోగతి చెందడం జరుగుతుంది. ఆర్థికంగా కొన్ని శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో అందరికీ సహాయకారిగా ఉంటారు. ఎవరితోనూ వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడాఅందుతాయి.
Also read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..
- చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఏకంగా ఉద్యోగం పోగొట్టుకున్న ఏఎస్ఐ.. అసలు మ్యాటర్ ఏంటంటే..
- ఆ ఒక్క రశీదు నమ్మి ఘోరంగా మోసపోయిన ప్రజాప్రతినిధి! సర్పంచ్ ఖాతా ఖాళీ!
- నాడు ప్రియుడి కోసం భర్తను చంపింది.. నేడు అతడే యముడయ్యాడు.. మరో ప్రియురాలితో కలిసి..
- ప్రాణంగా చూసుకునే అన్నకే చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలు.. నమ్మించి నట్టేట ముంచిన కాలేజ్ ఫ్రెండ్!
- ఎంత పని చేశావ్ సత్య.. అనుమానం రాకుండా బోరున ఏడ్చింది.. చివరకు ఏం జరిగిందంటే..










