పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో 4వ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవలో విశేష గుర్తింపు పొందిన గౌరవనీయులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు మొట్టమొదటిసారిగా యానాం విచ్చేసిన సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
యానాం పురవీధుల్లో భారీ ఊరేగింపుగా కార్యక్రమం నిర్వహించబడింది. మేళతాళాలు, బాణాసంచా వెలుగుల్లో అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఊరేగింపు ఆయన నివాసం వరకు అట్టహాసంగా కొనసాగింది.
ఈ సందర్భంగా పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబురావు గారు మంత్రి మల్లాడి కృష్ణారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. యానాం అభివృద్ధి, ప్రజాసేవలో ఆయన నాయకత్వం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మంత్రి మల్లాడి కృష్ణారావు గారు యానాం అభివృద్ధికి మరింత కృషి చేస్తారని కొల్లాటి బాబురావు విశ్వాసం వ్యక్తం చేశారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





