సాధారణంగా మనం ఎవరిదగ్గరైనా ఏదైనా వస్తువు తాకట్టు పెడితే ఏం చేస్తాం.. తర్వాత డబ్బులు చెల్లించి తీసుకుంటాం. డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ వస్తువు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాం. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తాను తాకట్టు పెట్టిన ఫోన్‌ను తిరిగి ఇవ్వడం లేదని.. ఏకంగా తాకట్టె పెట్టుకున్న వ్యక్తి చేతినే నరికేశాడు. అనంతరం అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాకట్టు పెట్టుకున్న సెల్ ఫోన్ తిరిగివ్వలేదని ఓ వ్యక్తి అతని చెయ్యి నరికి చేతిలో పెట్టిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నంబూరుకు చెందిన షేక్ భాష అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తూ తక్కెళ్ల పాడులో నివాసం ఉంటున్నాడు. అయితే ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో కొద్దీ రోజుల కిందట తమకు దూరపు బంధువైన గౌస్ వద్ద భాష స్కూటీ, సెల్ ఫోన్ తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. అయితే కొద్దీ రోజుల పోయిన తర్వాత తీసుకున్న డబ్బులు చెల్లించి స్కూటీ వెనక్కి తీసుకున్నాడు. అయితే సెల్ ఫోన్ గౌస్ వెనక్కి ఇవ్వలేదు. దీంతో ఈ విషయమై ఇద్దరికి మధ్య గొడవ జరుగుతుంది. రెండు మూడు సార్లు సెల్ ఫోన్ వెనక్కి ఇవ్వాలని భాష కోరినప్పటికీ గౌస్ స్పందించలేదు.
దీంతో ఇటీవల మరొసారి గౌస్ తక్కెళ్ల పాడు వచ్చాడు. అది తెలుసుకున్న భాష తన సెల్ ఫోన్ వెనక్కి ఇవ్వాలని మరోసారి అడిగాడు. దీంతో ఇద్దరి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే గౌస్ సెల్ ఫోన్ ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హెచ్చరించాడు. ఇక గౌస్ మాటలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భాష ఇంటికి వెళ్లి.. ఇంట్లో ఉన్న తల్వార్ తీసుకొని వచ్చి గౌస్‌పై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకునేందుకు గౌస్ చేతి అడ్డు పెట్టడంతో కత్తి చేతికి తలికి చేయి రెండు బాగాలుగా కట్టయింది. దీంతో తీవ్ర రక్త స్రావం కావడంతో గౌస్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇక భాష వెంటనే.. గౌస్ ను స్కూటీపై ఎక్కించుకొని గుంటూరులోని ఒక ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించాడు.
అనంతరం అక్కడ నుండి భాష పరారయ్యాడు. ఈ విషయం మొదట గౌస్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా ఆసుపత్రికి తరలి వచ్చారు. దాడి చేసింది భాషయే అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భాష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సిఐ నారాయణ స్వామి చెప్పారు.
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





