SGSTV NEWS online
CrimeTelangana

మొగుడు పెళ్ళాం మధ్య గొడవ.. సర్దిచెప్పడానికి వచ్చిన అత్త.. కాసేపటికే తలుపు వేసి..



తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపిన ఘటన ఇది. మద్యం మత్తుకు బానిసైన ఓ అల్లుడు, గొడవలు సర్దుబాటు చేసేందుకు వచ్చిన అత్తపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్సాన్‌పల్లి నుంచి వచ్చిన బాధితురాలు వట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు మహ్మద్ గరీబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తు మనుషులను ఎలా మృగంగా మారుస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.


మద్యం మత్తు మనిషిని మృగంగా మార్చేస్తోంది.. బంధాలు, అనుబంధాలను మరిచి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తోంది. అచ్చం ఇలాంటి ఘటనే తెలంగాణలో కలకలం రేపింది.. అత్తపై అల్లుడు అత్యాచారం ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలంలో వెలుగుచూసింది. వరుసకు తల్లి కావాల్సిన అత్తపైనే ఓ కిరాతక అల్లుడు కన్నేశాడు. గొడవలు సర్దుబాటు చేయడానికి వచ్చిన అత్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన ఆ కీచకుడి ఉన్మాదానికి ఒక కుటుంబం బలైపోయింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు.. రోజూ తాగొచ్చి భార్య ఫాతిమాతో గొడవ పడటం అతనికి అలవాటుగా మారింది. అయితే.. భార్యాభర్తల మధ్య గొడవలు మితిమీరడంతో.. గొడవను సర్దుబాటు చేసేందుకు అక్సాన్‌పల్లి నుంచి అత్తగారు ఖాదిరాబాద్‌కు వచ్చారు. ఇద్దరికీ నచ్చజెప్పి కాపురాన్ని చక్కదిద్దాలని ఆమె ప్రయత్నించారు..


అయితే, ఆ సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్న మహ్మద్ గరీబ్.. భార్యను బయటకు నెట్టేశాడు. అనంతరం అత్తను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, లోపల గడియ పెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటనతో షాక్‌కు గురైన బాధితురాలు.. వెంటనే వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది.


బాధితురాలి ఫిర్యాదు మేరకు వట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మహ్మద్ గరీబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts