Eluru Crime News: ఏలూరు జిల్లా
కామవరపుకోట మండలంలో వెలుగుచూసిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆధ్యాత్మిక ముసుగులో ఉన్న ఒక వ్యక్తి ఏ రకంగా బరితెగించాడో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. చౌటపల్లి రాంబాబు (42) అనే వ్యక్తి పాస్టర్గా చర్చిని నడుపుతూ ప్రార్థనల పేరుతో నమ్మించిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కూలి పనులు చేసుకునే ఆ కుటుంబం నిత్యం చర్చికి వస్తుండటంతో వారి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న నిందితుడు తరచూ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. తన పైశాచికత్వాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక భయంతో ఈ విషయాన్ని ఎవరికీ వెల్లడించలేక లోలోన కుమిలిపోయింది.
అయితే ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవడంతో తాను చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ పాస్టర్ మరింత క్రూరంగా వ్యవహరించాడు. గర్భం దాల్చకుండా చేసేందుకు గర్భనిరోధక మాత్రలను ఆ చిన్నారికి అధిక మోతాదులో వాడించాడు. దీనివల్ల ఆ బాలిక శరీరంలో తీవ్రమైన మార్పులు సంభవించి అధిక రక్తస్రావం కావడం మొదలైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక పరిస్థితి విషమించడంతో చేసేదేమీ లేక తన తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆ బాలికను హుటాహుటిన ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడు పాస్టర్ రాంబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తడికలపూడి ఎస్సె వల్లీపద్మ వెల్లడించారు. పోక్సో (POCSO) చట్టం శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





