మల్లాపూర్ : నిశ్చితార్థమయ్యింది… గల్ఫ్ లో ఉన్న ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విని ప్రియురాలు కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. బాధిత కుటుంబీకులు, పోలీసుల వివరాల మేరకు … పాతదాంరాజుపల్లికి చెందిన మక్కల సాయికుమార్ (22), సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లె శ్రుతి (20) ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వారి వివాహానికి అంగీకరించి ఏడు నెలల కిందట నిశ్చితార్థం చేశారు. సాయికుమార్ తన కుటుంబానికి రేకులషెడ్డు మాత్రమే ఉందని, ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పి బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ కూలి పనులు చేసుకుంటున్న క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 1 న ఆత్మహత్యకు పాల్పడినట్లు శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలిసిన శ్రుతి తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే రోజు అందరూ నిద్రించిన తర్వాత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని తానూ బలవన్మరణానికి పాల్పడింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది
Also read
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు





