SGSTV NEWS online
CrimeTelangana

దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఆ ఇంట



పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు కేకలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో వధువుగా ముస్తాబు కావాల్సిన యువతి,నేడు ఆసుపత్రి మంచంపై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కళ్ల ముందే తమ్ముడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మునిగిపోయింది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ గ్రామంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది.


వివరాల్లోకి వెళ్తే.. చిలిపిచెడ్ గ్రామానికి చెందిన పరశురాం, తన సోదరి రేణుకను తీసుకురావడానికి చండూర్ ఎక్స్ రోడ్డుకు వెళ్లాడు. హైదరాబాద్ నుంచి వస్తున్న అక్కను బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి వస్తుండగా.. చిలిపిచెడ్ వైపు నుండి జోగిపేట వెళ్తున్న కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరశురాం అక్కడికక్కడే మరణించగా, రేణుక రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాల య్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరసింహులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో మొదట సంగారెడ్డి బాలాజీ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిజానికి నేడు రేణుక పెళ్లికి సంబంధించి ‘పసుపు కొట్నం’ కార్యక్రమం జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఆసుపత్రి పాలవ్వడం, తమ్ముడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts