ఎన్టీఆర్ జిల్లా: కీసర టోలేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోలేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎన్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.
కారుపై పడిన ట్యాంకర్ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





