స్థానిక రాజకీయ నేత కుమారుడిపై ఆరోపణలు
హయత్ నగర్ : సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుంట్లూర్ ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Also read
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో





