హైదరాబాద్: నగరంలో మాదాపూర్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది. ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్‌లో చిక్కుకుపోయింది.
అనంతరం ఆ స్కూటీని అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వ్యాన్ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్‌ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. జ్యూయలరీ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్‌లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు.
అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్‌ను అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను, క్లీనర్నుపోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Also read
- గొల్కొండలో తారామతి బారాదరి రిసార్ట్.. పార్టీలో డ్రగ్స్ కలకలం, వెలుగులోకి కొత్త విషయాలు
- 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
- హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!
- Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?





