చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు.
చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





