హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది, ఓ సైకో కిల్లర్ ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. కేవలం రూ.26,500 కోసం వారిని హత్య చేసిన ఘటన స్థానికంగా షాకింగ్‌గా మారింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది, ఓ సైకో కిల్లర్ ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. కేవలం రూ.26,500 కోసం వారిని హత్య చేసిన ఘటన స్థానికంగా షాకింగ్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు(serial killer arrest) నగరాన్ని కుదిపేసింది.
Psycho Murdered Two People
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసు అనే నిందితులు ఆన్‌లైన్ పేకాట వ్యసనానికి బానిసయ్యాడు. పేకాటలో డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి పేకాట ఆడడానికి కావలసిన డబ్బుల కోసం ఈ ఘోరాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వరుసగా రెండు రోజుల పాటు జూదం ఆడిన వాసు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. మూడో రోజు మళ్లీ పేకాట ఆడేందుకు డబ్బులు లేకపోవడంతో సైకోగా మారాడు.
మొదట ఫిలింనగర్(Film Nagar Hyderabad) ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళను హత్య చేసిన వాసు, ఆ తర్వాత ఆ శవంపై ఉన్న బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. అనంతరం ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో రెండు రోజులు జూదం ఆడాడు. ఆ డబ్బులు కూడా పోవడంతో మరోసారి డబ్బుల కోసం యాదమ్మ అనే వృద్ధురాలిని లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని అనంతరం హత్య చేశాడు. ఆ శవాన్ని కారు(car-driver) లో పెట్టుకుని జూబ్లీహిల్స్ నుంచి మొకిలా వరకు సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడ మృతదేహాన్ని పారేశాడు. ఆమె పై ఉన్న నగలను తీసుకుని తిరిగి పేకాట ఆడాడు. కాగా, సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించిన ఫిలిం నగర్ పోలీసులు నిందితుడు వాసును అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నగరంలో ఆడవారి భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.
Also read
- Hyderabad: రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్యాధికారి..!
- రీల్స్ క్రేజ్.. పచ్చని కాపురంలో చిచ్చు.. చివరికి ఊహించని విషాదం!
- ATM Robbery: నగరంలో భారీ చోరీ.. ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- Hyderabad: సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!
- Hyderabad: షేక్‌పేట లేడీస్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి





