రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యా ఇద్దరు పిల్లలపై దారుణంగా దాడి చేయడంతో భార్య, కుమారుడు మృతి చెందాడు. కూతురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.. ఈ దారుణ సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆమనగల్లు మండలం సీతారాంనగర్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో ఈ దారుణం వెలుగు చూసింది. రోజు మాదిరిగానే బాణావత్ రాందాస్ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం (మార్చి 31) రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం తాగొద్దని భార్య వాదించింది. దీంతో క్షణికావేశంలో భార్య కవిత, కుమారుడు హర్ష, కూతురు ప్రణీతలపై బాణావత్ రాందాస్ దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టడంతో భార్య కవిత, కుమారుడు హర్ష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కూతురు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





