SGSTV NEWS online
Andhra PradeshCrime

RTA చలాన్ పేరుతో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఏపీ MLA.. కట్ చేస్తే..


ఒక లింక్.. ఒక క్లిక్.. అంతే అకౌంట్ ఖాళీ! సైబర్ నేరగాళ్ల బారిన సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా పడుతున్నారనే మరో ఘటన వెలుగుచూసింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ కేటుగాళ్లు మోసం చేసి భారీగా నగదు దోచుకెళ్లారు. అధికారిక సమాచారం ప్రకారం, ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన ఓ యాప్ లింక్‌ను ఎమ్మెల్యే క్లిక్ చేయడంతో ఈ మోసం జరిగింది. తెలియక ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.12 లక్షలు మాయమైనట్లు వెల్లడైంది. జంగారెడ్డిగూడెంలో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ క్రాంతికుమార్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అపరిచిత లింక్‌లు, యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోరాదని, అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also read

Related posts