SGSTV NEWS online
Astrology

Weekly Horoscope: హమ్మయ్య.. ఆర్థిక విషయాల్లో వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మార్చి 22-28, 2026): మేష రాశి వారికి ఈ వారం ఇంటా బయటా ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరిగే అవకాశముంది. మిథున రాశి వారు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో బుధ, రాహువులతో కలిసి ఉన్నందువల్ల ఇంటా బయటా ప్రాభవం బాగా పెరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి, వివాదాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పలుకుబడి బాగా పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశినాథుడు శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరిగే అవకాశముంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సర్వత్రా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాలు సాఫీగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రుల వల్ల ధననష్టం కలుగుతుంది.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో కుజ, రాహువులతో కలిసి ఉండడం వల్ల విదేశీ అవకాశాలు సానుకూలంగా ఉండడం, విదేశాలపరంగా కలిసి రావడం జరుగుతుంది. దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలైన పురోగతి, అభివృద్ధి ఉంటాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల తీరుతెన్నులు సానుకూలంగా మారుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకోని పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రాశ్యధిపతి చంద్రుడు మేష, వృషభ రాశుల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభముంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక సహాయం విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి అష్టమ స్థానంలో శని, శుక్రులతో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతి బాగా మందగిస్తుంది. కుజుడి అనుకూలత వల్ల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఉంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరిగినా పెరగకపోయినా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు, ఆర్థిక సంబంధమైన వాగ్దానాలకు, సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశముంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు షష్ట స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో మార్పులు చేసి లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రయాణాలు  లాభిస్తాయి.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు ఈ వారమంతా చతుర్థ స్థానంలో బుధ, రాహువులతో కలిసి ఉండడం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంపన్న కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉన్నత పదవి లభించే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆస్తి వివాదంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, కుజ, బుధ, రాహువులు ధన స్థానంలో సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశముంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక వ్యవహా రాలన్నీ సజావుగా పూర్తవుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది.



కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) 

రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో, రవితో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అపార్థాలు, అభి ప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో ఉచ్ఛ శుక్రుడి సంచారం, శని, రవులతో కలిసి ఉండడం, రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండడం వంటి కారణాల వల్ల కొద్ది శ్రమతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సాయంతో పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువులకు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

Also read

Related posts