Ugadi 2026 Panchangam Kanya Rashi Phalalu: సప్తమ శనిప్రభావం, షష్ట రాహు, దశమ-లాభ స్థానంలో గురు సంచారం కారణంగా కన్య రాశి వారికి కొత్త సంవత్సరంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కొద్దిపాటి సమస్యలు వస్తున్నా, గురు బలం వాటిని అధిగమించగలదు. స్నేహితుల సహాయం లభించవచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి.
కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..
ఆదాయం-8, వ్యయం-11 | రాజపూజ్యం-3, అవమానం-3
సప్తమ స్థానంలో శనీశ్వరుడు, షష్ట స్థానంలో రాహువు, దశమ, లాభ స్థానాల్లో గురువు సంచారం వల్ల ఈ రాశివారు కొత్త సంవత్సరంలో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఇతర గ్రహాల వల్ల కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, గురు బలం వల్ల వీటన్నిటినీ అధిగమించే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవహారాలుః ప్రధాన గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూ లంగా ఉంటాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి, ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి.
వృత్తి, ఉద్యోగాలుః వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు చికాకు కలిగిస్తాయి. బంధుమిత్రులతో సంబంధాలు బెడిసికొడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు.
కుటుంబ వ్యవహారాలుః ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయ త్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
