హైదరాబాద్/ఏలూరు, మార్చి 15: హైదరాబాద్ మొయినాబాద్ లో నిన్న జరిగిన జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తినో రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునన్నారు. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని, కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళానని, కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని, వాటిని ఎవ్వరూ నమ్మవద్దని, పోలీసు విచారణకు సహకరిస్తానని, పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని ఎంపీ తన ప్రకటనలో తెలిపారు. నిజం గెలుస్తుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు, అభిమానులకు ఎంపీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఇట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి కార్యాలయం,
ఏలూరు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





