👉ఏలూరు జిల్లా….బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గుబ్బల మంగమ్మ జలాశయంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.
స్థానికుల సహాయంతో పోలీసులు రాత్రి సమయం కావడంతో ట్రాక్టర్ల లైట్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతి దేహాన్ని బయటకు తీశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం కావడంతో దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా దొరమామిడి గుబ్బల మంగమ్మ జలాశయంలో ఈతకు దిగి ఇద్దరు తుమ్మల నాగరాజు, తుమ్మల రమణ గల్లంతు అయ్యి మృత్యువాత పడ్డారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి సమయం కావడంతో ట్రాక్టర్ల లైట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





