SGSTV NEWS online
Spiritual

Lord shiva: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!



Lord shiva: హిందూ దర్మం లో పరమశివుడు ని ‘ముక్కంటి’ అని పిలుస్తాం. ఆయనకు ఉండే మూడు కళ్ళు కేవలం శారీరకమైనవి కావు. అవి లోతైన ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉన్నాయి. అలాగే.. మనిషి జీవితం, మరణం, తర్వాత జరిగే దాని గురించి వివరించే ‘గరుడ పురాణం’ మన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. శివుడి మూడో కన్ను జ్ఞానానికి, లయానికి సంకేతమైతే.. గరుడ పురాణం కర్మ ఫలితాలను వివరిస్తుంది. ఈ రెండింటి వెనక ఉన్న ఆసక్తికరమైన నిజాలు, పురాణ గాథలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శివుని త్రినేత్రం, గరుడ పురాణ రహస్యాలు:

మన పురాణాలలో ప్రతి అంశం వెనక ఒక శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక కారణం దాగి ఉంటుంది. శివుడిని మనం ‘త్రినేత్రధారి’ అని ఎందుకు అంటాం? అలాగే గరుడ పురాణాన్ని చదవడానికి ఎందుకు భయపడతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మన సంస్కృతిలోని గొప్పతనం అర్థమవుతుంది.

శివుడికి మూడు కళ్ళు ఎందుకు?

శివుడికి ఉన్న రెండు కళ్ళు సూర్యచంద్రులకు సంకేతాలు. ఇవి ఇహలోకంలోని పగలు, రాత్రి, కాల గమనాన్ని సూచిస్తాయి. కానీ.. నుదుటిపై ఉండే మూడవ కన్ను ‘అగ్ని’ తత్వానికి, ‘జ్ఞానానికి’ ప్రతీక.

Related posts