బనశంకరి: చూస్తే ఆకర్షణీయమైన పెయింటింగ్స్ మాదిరిగా ఉంటాయి, కానీ అవి కోట్ల రూపాయల విలువజేసే డ్రగ్స్ తయారైనవని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేరళ జంటని పోలీసులు అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్్సంగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేరళకు చెందిన అశ్విన్ (24), ముబీనా (25) బెంగళూరులో బీబీఏ చదవడానికి వచ్చి మధ్యలోనే చదువును ఆపేసి మత్తు పదార్థాల వ్యాపారంలోకి దిగారు. థాయ్ లాండ్ నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు.
ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ ఫ్లాట్‌పై దాడి చేసి అశ్విన్, ముబీనాను అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన 8,335 ఎల్ఎస్ఓ స్ట్రిప్స్, 5 కేజీల హైడ్రో గంజాయి, 534 గ్రాముల చరస్ తదితరాలను సీజ్ చేశారు. పెయింటింగ్స్ రూపంలో ఎల్ఎస్ఓ స్ట్రిప్స్‌ను తయారు చేసి కావలసినవారికి విక్రయించేవారు. దీనివల్ల ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. అలాగే చాక్లెట్లు, బిస్కెట్ బాక్సుల్లో హైడ్రో గంజాయి ప్యాక్ చేసి తరలించేవారు.
Also read
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య
- ఠాణాలో భార్యపై కత్తితో దాడి
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!





