Festivals in March: ఈ ఏడాది మార్చి నెలలో చాలా ముఖ్యమైన పండగలు వస్తున్నాయి. మార్చి తొలివారంలోనే హోలీ పండగ వస్తోంది. ఆ తర్వాత మార్చి 8వ తేదీ రంగ పంచమి, 10వ తేదీ శీతల సప్తమి, 11వ తేదీ శీతల అష్టమి కూడా నిర్వహిస్తారు. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రానుంది. ఇది తెలుగు వారికి నూతన సంవత్సరం. కొత్త పంచాంగం మొదలయ్యే రోజు. ఇలా మార్చి
నెలలో ముఖ్యమైన పండగలు ఉన్నాయి.
ఈ ఏడాది మార్చి నెలలో చాలా ముఖ్యమైన పండగలు వస్తున్నాయి. నెల ప్రారంభంలోనే మార్చి 3 లేదా మార్చి 4వ తేదీ హోలీ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. హోలీకి ముందు రోజు హోలీకా దహనం, కామ దహనం నిర్వహిస్తారు. ఈసారి మూడో తేదీ చంద్రగ్రహణం కూడా రానుంది. మార్చి 4వ తేదీ హోలీ పండుగ జరుపుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్చి 2 లేదా 3 తేదీల్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఈ నెల గురువారం బాయ్ దూజ్ నిర్వహిస్తారు. ఇక మార్చి 8వ తేదీ రంగ పంచమి, 10వ తేదీ శీతల సప్తమి, 11వ తేదీ శీతల అష్టమి కూడా నిర్వహిస్తారు. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రానుంది. ఇది తెలుగు వారికి నూతన సంవత్సరం. కొత్త పంచాంగం మొదలయ్యే రోజు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఉగాది పండుగ విశిష్టంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పచ్చడి ఈ పండగకు ప్రత్యేకం.
ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ రాశులను బట్టి జాతకం తెలుసుకుంటారు. ముఖ్యంగా, ఈ సంవత్సరం ఆదాయం, వ్యయాలు ఎలా ఉంటాయో, జీవితంలో ముఖ్యమైన విషయాలు ఎలా కుదిరుతాయో పంచాంగం ద్వారా రాశిఫలాలను పరిశీలిస్తారు.
ఉత్తరాదిలో కూడా ఈ వేడుక ఉంది. ఉగాది వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. ఆ తర్వాత మార్చు 26వ తేదీ శ్రీరామనవమి నిర్వహిస్తారు. ఈరోజు సీతారాముల కళ్యాణం వేడుకగా జరుపుకుంటారు. ప్రముఖ ఆలయాల్లో ఈ వేడుకగా వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి గురువారం రానుంది.
ముస్లింల నిర్వహించే రంజాన్ వేడుకలు కూడా మార్చి 20వ తేదీ శుక్రవారం రానుంది. ఆ రోజు ముస్లిం సోదరులు రంజాన్ నెల జరుపుకుంటారు. బంధుమిత్రులతో కలిసి వేడుకగా ఈ పండుగ నిర్వహిస్తారు.
Also read
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..





