హైదరాబాద్ హబ్సిగూడలో రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఓయూ పోలీసులు అత్యంత త్వరితగతిన చెందించారు. కేవలం గంటల వ్యవధిలోనే దొంగను అదుపులోకి తీసుకున్నారు. చోరీ ఘటనలో నిందితురాలు నాగర్ కర్నూలు అచ్చంపేటకు చెందిన అల్లం తేజస్వినిని అరెస్ట్ చేశారు. హబ్సిగూడ గ్రీనిల్స్ కాలనీలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి.ఎల్.కె.ఎం.రావు ఇంట్లో పని మనిషిగా చేరిన తేజస్విని ఆర్థిక ఇబ్బందుల వల్ల అడ్డదారిలో వెళ్లింది. తను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే చోరీకి ప్లాన్ చేసింది. అదును చూసి ఇంట్లో నుంచి 9 తులాల బంగారం దొంగిలించింది.
ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తూ యజమాని కళ్లు కప్పి దొంగతనానికి పాల్పడింది. ఏదో అనుమానం వచ్చిన డాక్టర్ పి.ఎల్.కె.ఎం.రావు బీరువా చెక్ చేయగా, అందులో ఉన్న బంగారం కనిపించలేదు. వెంటనే ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసును కేవలం 36 గంటల్లో పరిష్కరించారు పోలీసులు. నిందితురాలి దగ్గర 9 తులాల బంగారు ఆభరణాలు, పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను రిమాండ్కు తరలించారు. ఇందుకు గానూ ఓయూ ఏసిపి జగన్ సిబ్బందిని ప్రశంసించి రివార్డు ప్రదానం చేశారు.
ఓయూ ఏసిపి జగన్ తెలిపిన వివరాల ప్రకారం తప్పించుకోవాలని చూసిన దొంగలను త్వరగా పట్టుకున్నామని చెప్పారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు రాత్రి- పగలు కూడా పోలీస్ పెట్రోలింగ్ పెంచామని తెలిపారు. పౌరులు అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also read
- బైక్పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?
- ఓ మహిళ, మరో నలుగురు వ్యక్తులు.. నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించారు.. కట్ చేస్తే..
- వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలు.. మీ పూర్వీకుల ఆశీస్సులు లభించి సక్సెస్ మీ సొంతం!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





