SGSTV NEWS online
Spiritual

అమలక ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే.. లక్ష్మీనారాయణుల కటాక్షంతో సిరిసంపదలు ఖాయం..!




Amalaki Ekadashi 2026: అమలక ఏకాదశిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. ఉసిరి చెట్టులోనే లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు వాసం చేస్తారని విశ్వాసం. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. దానధర్మాలు చేయడం, ముఖ్యంగా ఉసిరికాయలు, ఇతర పండ్లు దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈరోజున ప్రత్యేక పూజలు భక్తితో చేస్తే ఆనందం, ఆయురారోగ్యం, సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తంగా చెబుతారు.


ఏకాదశి తిథికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. ఫాల్గుణ మాసం శుక్లపక్ష ఏకాదశినే అమలక ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో విష్ణు (Vishnu) భగవానుని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అమలక ఏకాదశిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. ఉసిరి చెట్టులోనే లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు వాసం చేస్తారని విశ్వాసం. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. దానధర్మాలు చేయడం, ముఖ్యంగా ఉసిరికాయలు, ఇతర పండ్లు దానం చేయడం అత్యంత పుణ్యప్రదం.


అమలక ఏకాదశి 2026 తేదీ, తిథి సమయం

•  2026 సంవత్సరంలో అమలక ఏకాదశి ఫిబ్రవరి 27, శుక్రవారం నాడు ఆచరించాలి.

•  ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 26 అర్ధరాత్రి 12:33 గంటలకు

•  తిథి ముగింపు: ఫిబ్రవరి 27 రాత్రి 10:30 గంటలకు

•  ఈ సమయంలో ఉపవాసం, పూజాచరణలు చేయడం శ్రేయస్కరం.

👉అమలక ఏకాదశి విశిష్టత

•  ఉసిరి చెట్టును దర్శించినా పాపాలు తొలగుతాయని నమ్మకం.

• ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది.

•  ఉసిరి చెట్టుకు నీరు పోసి, ప్రదక్షిణలు చేసి “ఓం శ్రీ విష్ణు ప్రియ నమః” మంత్రాన్ని జపిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విశ్వాసం.

•  ఆవనూనెతో దీపం వెలిగించడం ద్వారా గ్రహదోషాలు తగ్గుతాయని అంటారు.

•  ఉసిరికాయలను దానం చేయడం ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని భావిస్తారు.

•  ఈ పూజలు భక్తితో చేస్తే ఆనందం, ఆయురారోగ్యం, సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తంగా చెబుతారు.

ఏకాదశి పూజా విధానం

👉  తులసి దళాలతో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.

👉  “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని జపించాలి.

👉  పూలు, అక్షింతలు, కుంకుమ సమర్పించాలి.
ఉసిరి దీపాలను వెలిగించడం శుభప్రదం.

👉  నైవేద్యంగా ఉసిరికాయలు సమర్పించవచ్చు.

👉  ఏకాదశి స్తోత్రాలు, విష్ణు శ్లోకాలు పారాయణం చేయడం మరింత శ్రేయస్కరం.

అమలక ఏకాదశి రోజున ఉపవాసం, పూజలు, దానధర్మాలు చేస్తే పాప విమోచనం కలిగి, మోక్షప్రాప్తి సాధ్యమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. భక్తిశ్రద్ధలతో ఆచరించిన ఈ వ్రతం జీవితంలో శాంతి, సంతోషం, సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం.

Related posts