Caste Discrimination: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి చెందిన బద్దీ పవన్ను డిసెంబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో అబ్బాయి తరపున కులం వారు ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభ అశుభ కార్యాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపారు.
ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారుల కు ఫిర్యాదు చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి చెందిన బద్దీ పవన్ను డిసెంబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో అబ్బాయి తరపున కులం వారు ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభ అశుభ కార్యాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపారు. ఈ విషయమై గత నెలలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని కాబట్టి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. తమను గ్రామ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
సమాజంలో బతికించే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అందరిలాగా.. తమకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రేమ జంట ఇచ్చిన పిర్యాదుపై.. అధికారులు విచారణకి ఆదేశించారు.
Also read
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో
- ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
- ‘నా చావుకు కారణం వెంకటేశ్..’
- కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?





