తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అటు నీరుగట్టువారిపల్లిలోని కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మరికాసేపట్లో హత్యకు గురైన చిన్నారి డెడ్ బాడీకి అంత్యక్రియలు జరగనున్నారు. స్వగ్రామం వీరబల్లి మండలంలో అంత్యక్రియలు చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఇంటికి సమీపంలోనే బాలిక ఓ డ్రమ్ములో శవమై కనిపించింది. కులవర్ధన్ అనే వ్యక్తిని అనుమానించారు పోలీసులు. ఈ కులవర్ధన్ బాలిక ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసి డ్రమ్ములో కుక్కి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి డెడ్ బాడీ ఈ ఉదయం చెరువులో దొరికింది.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





