పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య మీద ఉన్న కోపంతో ఓ వ్యక్తి తన అత్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర కాలిన గాయాలతో అవస్థపడుతున్న బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మీద కోపంతో ఓ వ్యక్తి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మీ, శ్రీనుకు నలుగురు సంతానం. వీరి రెండో కుమార్తె లావణ్యను అదే గ్రామానికి చెందిన జక్కా రవి అనే వ్యక్తి ఇచ్చి కొన్నాళ్ల క్రితం వివాహం జరిపించారు. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. వీరు రవి తల్లైన తన నానమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు. అంతా బానే ఉందనుకున్న సమయంలో అనుమానం అనే భూతం భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో గత కొన్ని రోజులుగా భార్యను అనుమానించడం స్టార్ట్ చేశాడు.
ఇది భార్యభర్తల మధ్య తరుచూ గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలోనే అనేక సార్లు వీరు పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతన్న సమయంలోనే అత్త లక్ష్మీని వచ్చి తమ ఇంట్లో ఉండాలంటూ రవి ఒత్తిడి చేశాడు. లక్ష్మీ భర్త శ్రీను దివ్యాంగుడు కావడంతో రవి ఆమెను తమ వద్దే ఉండాలంటూ పట్టుబట్టేవాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం లక్ష్మీ భర్త శ్రీను కాలం చేశాడు. అప్పటి నుండి రవి మరింతగా లక్ష్మీపై ఒత్తిడి తెచ్చాడు. అయితే లక్ష్మీ మాత్రం అల్లుడింటికి వెళ్లడానికి నిరాకరించింది. మిగిలిన పిల్లలను ద్రుష్టిలో పెట్టుకొని రెండో అల్లుడు వద్దకు వెళ్లేందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై రవి కక్ష పెంచకున్నాడు.
తాను ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోవడంతో ఎలాగైనా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాలని భావించాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సమయంలో ఇంటి వద్ద అరుగుపై కూర్చొన్న అత్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. గమనించిన స్థానికులు మంటలార్పి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన తర్వాత పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దాచేపల్లిలో లక్ష్మీతో సహా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అల్లుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రవిపై కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also read
- గొల్కొండలో తారామతి బారాదరి రిసార్ట్.. పార్టీలో డ్రగ్స్ కలకలం, వెలుగులోకి కొత్త విషయాలు
- 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
- హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!
- Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?





