శివాజీనగర(కర్ణాటక): హాసన్ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన ఓ మహిళను కుణిగల్ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్కు చెందిన వలస కార్మికుడు దేవిడ్ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహారు పారిపోవాలని పథకం వేశారు.
ఆ మేరకు ఫిబ్రవరి 12న చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు మొబైళ్ల లొకేషన్ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also read
- టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!





