SGSTV NEWS online
Andhra PradeshCrime

Tragedy in Visakhapatnam: విశాఖలో పండగపూట విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి




Tragedy in Visakhapatnam:విశాఖలో పండగపూట విషాదం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో 6మంది బీటెక్ విద్యార్థులు రుషికొండ బీచ్ కు వెళ్లారు. బీచ్ లో ఈత కొడుతుండగా ఒక విద్యార్థి గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

కొమ్మదిలోని గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు రుషికొండ బీచ్ కు వెళ్లారు. సముద్ర తీరంలో ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా అలలు ఎగిసిపడటంతో విద్యార్థి పి.అరవింద్ కృష్ణ నీటిలో కొట్టుకుపోయారు. దీన్ని గమనించి రాజీవ్.. తన స్నేహితుడు అరవింద్ ను కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరూ కూడా నీటిలో కొట్టుకుపోయారు.

గమనించిన మిగిలిన స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో బ్లూ బీచ్ లైఫ్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున బోటింగ్ యాజమాన్యం సముద్రంలోకి వెళ్లి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అయితే వీరిలో అరవింద్ కృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అరవింద్ కృష్ణ స్వస్థలం రాజమండ్రి కాగా విశాఖ కొమ్మదిలోని గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Also read

Related posts