మహారాష్ట్రలోని జిల్లా కేంద్రం గోండియాలో ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుడు చికిత్స పేరుతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి మూజ్నెల్ల చిన్నారిని మరో మహిళకు రూ.2.5 లక్షలకు అమ్మేశాడు. పాప పుట్టినప్పుడు అధిక బరువు ఉండటంతో తల్లిదండ్రులు గోండియాలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని, నాగ్పుర్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఆర్థికసహాయంతో వైద్యం చేస్తామని నమ్మబలికిన వైద్యుడు పాప బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ‘విక్రయ’ పరిణామాలతో పాప భండారా జిల్లాకు చెందిన మహిళ ఇంటికి చేరింది. ఈ విషయాన్ని ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళాశిశు సంక్షేమశాఖ హెల్ప్ లైనుకు పిర్యాదు చేశాడు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం అయిదుగురిపై కేసు నమోదుచేసి, పాపను కొన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన డాక్టర్ నితేశ్ బాజ్పేయీ పరారీలో ఉండగా… అతడి కోసం గాలిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





