సాక్షాత్ శివస్వరూపులు గురుతుల్యులు తుని తపోవనం పీఠాధీశ్వరులు తాండవ కాశీ క్షేత్రం ఆశ్రమం నిర్వహకులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు ఈ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మీభూతులు అయ్యారు. 13-02-2026 శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో శివైక్యం చెందారు
మాఘమాసంలో ఏకాదశి తిథినాడు మూలా నక్షత్రంలో శుక్రవారం రోజున స్వామి వారు శివైక్యం చెందారు అంటే గురువు గారు సాక్షాత్తు అమ్మవారే
నిత్యానుష్ఠాన తత్పరులై, నిరంతరం గో సేవ, వేద, వేదభాష్య తదితర ధర్మపరిరక్షణ తత్పరులై ఎంతోమందికి ధర్మ మార్గ నిర్దేశుకులైన
శ్రీ స్వామివారు పరమ పవిత్రమైన భౌతిక దేహాన్ని విడిచి మనకు భౌతికంగా దూరమవ్వటం సనాతన వైదిక లోకానికి తీరనిలోటు…. బాధాతప్త హృదయంతో స్వామీజీ కి అశృ నివాళులర్పిస్తూ..
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
