SGSTV NEWS online
Andhra PradeshCrime

కడపలో మహిళా హెచ్ఎం ఆత్మహత్యాయత్నం



కడప అర్బన్: కడపలోని మున్సిపల్ హై స్కూల్ (మెయిన్)లో ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49) శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు, బాధితురాలి బంధువులు, సహచర ఉపాధ్యాయులు అందించిన వివరాలు.. జింకా జమీమా సుందరం, ఆమె భర్త పుష్ప రాజు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. వారు ఐఐటీల్లో చదువుతున్నారు. కొన్నేళ్లుగా మున్సిపల్ హైస్కూల్ మెయిన్ లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జమీమా సుందరం ఇటీవల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు.

ఉపాధ్యాయులు, సిబ్బంది రికార్డుల వ్యవహారాలు, జీతభత్యాల నిర్వహణ వంటి బాధ్యతలతో పని ఒత్తిడి పెరిగింది. భర్త పుష్ప రాజ్ మొదట్లో రికార్డుల నిర్వహణలో సహాయం చేసినా.. ఇటీవల పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో హెచ్ఎం జమీమా సుందరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు వాయిస్ మెసేజ్ పాఠశాల గ్రూప్లో పెట్టడంతో సహచర ఉపాధ్యాయులు వెంటనే ఇంటికి వెళ్లారు.

వేలాడుతున్న ఆమెను కిందికి దించి ఎర్రముక్కపల్లె రహదారి-లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డీఈవో షంషుద్దీన్, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పని ఒత్తిడా.. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యకు యత్నంచారా అన్నది తేలాల్సి ఉంది.

Related posts