గుంటూరు: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీ.. కాసేపు ఉద్రిక్తతకు కారణమైంది. గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహాపాపం పేరుతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని వైసీపీ నేత అంబటి రాంబాబు శుక్రవారం చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అంబటి ఫ్లెక్సీ వద్దకు వస్తామని ప్రకటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీ వద్దకు భారీగా చేరుకున్నారు. గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్లెక్సీ వద్దకు రావొద్దని అంబటికి పోలీసులు సూచించారు. అయితే, ఆలయంలో పూజల తర్వాత అంబటి ఆ మార్గంలో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అంబటి కారు దిగేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారించారు. ఆగ్రహంతో ఊగిపోయిన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు.
వీడియో…
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంబటిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు.
అంబటిపై ఎస్పీకి ఫిర్యాదు..
సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తెదే నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సమాచారం.మరో వైపు గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటి వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కన్నకూతురిపైనే అత్యాచారం.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
- అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
- హైదరాబాద్ లో మహిళ అనుమానాస్పద మృతి..
- ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





