హైదరాబాద్: నగరంలోని కోఠి ఏరియాలో కాల్పుల కలకలం రేగింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఓ వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపిన దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
రిన్షాద్ అనే వ్యక్తి శనివారం ఉదయం 7గం. ప్రాంతంలో తన డబ్బు డిపాజిట్ చేయడానికి కోఠి హెడ్ ఆఫీస్ బయట ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన ఐదుగురు దుండగులు.. తుపాకీతో బెదిరించారు. పెనుగులాట జరగడంతో.. కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో రిన్షాద్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఆపై దుండగులు నగదు బ్యాగుతో పారిఏపోయారు.
గాయపడిన రిన్షాద్ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణహాని తప్పిందని వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న సుల్తాన్బజార్ పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.
రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారి అని, తన రూ.6 లక్షల నగుదును డిపాజిట్ చేసేందుకు వచ్చిన క్రమంలోనే చోరీ జరిగిందని ఏసీపీ మీడియాకు వెల్లడించారు. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి రెండు షెల్స్ని స్వాధీనం చేసుకున్నాయన్నారు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే కాలిలో కాల్చి నగదు ఎత్తుకెళ్లి ఉంటారని.. నిందితులు పాత నేరస్తులై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారామె. నిందితుల పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





