గట్టుప్పల్: ప్రభుత్వ వసతి గృహం (హాస్టల్)లో ఉండటం ఇష్టం లేక పురుగు మందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట న నల్లగొండ జిల్లా అంతంపేట గ్రామంలో శనివారం జరిగింది. ఆదివారం పోలీసులు, గ్రా మస్తులు వివరాలు తెలిపారు. అంతంపేట Do మానికి చెందిÇన వీరమళ్ల వెంకటయ్యకు ముగ్గురు కుమార్తెలు.
పెద్ద కుమార్తె వివాహం చేయగా.. రెండో కుమార్తె నవ్య (15) నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన నవ్య తిరిగి హాస్టల్ వెళ్లడం ఇష్టం లేక శనివారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.
Also Read
- నేటి జాతకములు…16 జూన్, 2026
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..





