ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయానికి సమీపంలోని ఎన్నో ప్రత్యేతకతలు కలిగిన బేడి హనుమాన్ ఆలయం ఉంది. ఇక్కడ హనుమంతుడు బంగారు బేడీలతో బంధించబడి ఉంటాడు. సముద్రపు అలలు జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి జగన్నాథుడు స్వయంగా హనుమంతుడిని బంగారు గొలుసుతో బంధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆలయం గురించి మరింత తెలుసుకుందాం.
ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం చుట్టూ చరిత్ర కలిగిన అనేక ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బేడీ హనుమాన్ ఆలయం. బేడీ హనుమాన్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలో హనుమంతుడు బంగారు గొలుసుతో బంధించబడి దర్శనమిస్తాడు. అందుకే ఆలయాన్ని బేడీ హనుమాన్ టెంపుల్ అంటారు. ఎక్కడా లేని విధంగా బంగారు గొలుసుతో బంధింపబడిన హనుమంతుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు.
బేడి హనుమాన్ ఆలయం అని ఎందుకు పిలుస్తారు?
గొలుసులతో బంధించబడి ఉండటం వల్లే బేడీ హనుమాన్ అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. అయితే, దీనికి ఒక చరిత్ర ఉంది. పురాతన కాలంలో సముద్రపు అలలు జగన్నాథ ఆలయంలోకి మూడు సార్లు ప్రవేశించేవని చెబుతారు. దీని కారణంగా జగన్నాథుడు వాయు కుమారుడైన హనమంతుడిని ఇక్కడి సముద్రాన్ని నియంత్రించేందుకు నియమించాడు. కానీ, హనుమంతుడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను చూసేందుకు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు.. సముద్రం కూడా అతని తర్వాత నగరంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. ఇది చూసిన జగన్నాతుడు.. సముద్రపు అలలను నిరోధించడానికి హనుమంతుడిని బంగారు గొలుసులతో బంధించాడు. అందుకే ఈ ఆలయాన్ని బేడి హనుమాను ఆలయం అంటారు.
బేడి హనుమాన్ ఆలయం విశిష్టత
తూర్పు ముఖంగా ఉన్న హనుమాన్ ఆలయ నిర్మాణం చాలా సరళంగా, అందంగా ఉంటుంది. ఆలయ ప్రధాన దేవత హనుమంతుడు కుడి చేతిలో గదను, ఎడమ చేతిలో లడ్డును పట్టుకుని ఉంటాడు. ఆలయ బయటి గోడలపై వివిధ దేవుళ్ల చిత్రాలు ఉన్నాయి. దక్షిణ గోడపై గణేశుడి విగ్రహం ఉంది. పశ్చిమ గోడపై హనుమంతుడి తల్లి అంచనాదేవి విగ్రహం ఉంది. ఆమె ఒడిలో బాల హనుమంతుడు ఉండగా.. ఉత్తర గోడపై అనేక దేవుళ్లు, దేవతల చిత్రాలు ఉన్నాయి. పూరీ వెళ్లినప్పుడు మీరూ ఈ ప్రత్యేక ఆలయాన్ని దర్శించుకోవడం మరిచిపోకండి
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





