నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మెరైన్ పోలీసులు,మత్స్యకారులు తెలిపిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు అల్లూరు సమీపంలోని ఆములూరు చైల్డ్ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. కనుమ పండుగ కావడంతో అల్లూరు పరిధిలోని ఎర్రపుగుంట గ్రామానికి వచ్చారు. ఇసుకపల్లి బిఎంఆర్ కాలనీకి చెందిన అభిషేక్‌తో కలిసి ఈత ఆడేందుకు ఆరుగురు విద్యార్ధులు సముద్రతీరానికి వచ్చారు. సంద్రం ఒడ్డున ఈత ఆడుతుండగా ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు ఈగ అమ్ములు (14) ఈగ బాలకృష్ణ (15) మృతదేహాలను వెలికితీశారు. ఇంటర్ చదువుతున్న బుచ్చిరెడిపాళెంకు చెందిన గందర్ల సుదీర్ (15), ఇసుకసల్లికి చెందిన అభిషేక్ (15)ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ నాడు సముద్రతీరంలో గస్తీ నిర్వహించాల్సిన మెరైన్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారని స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





