SGSTV NEWS online
Spiritual

Garuda Puranam: ఇలాంటి మనుషులు వచ్చే జన్మలో రాబందులుగా పుడతారట



Garuda Puranam: గరుడ పురాణం హిందూ ధర్మంలో ముఖ్యమైనది. ఇది జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం, పాపపుణ్యాల గురించి వివరించినది. ఇందులో పునర్జన్మ వంటి అంశాలు ఉన్నాయి. కొన్ని పనులు చేయడం వల్ల వచ్చే జన్మలో మనుషులు ఎలాంటి జన్మ పొందుతారో గరుడ పురాణం చెబుతోంది.

గరుడు పురాణం ఏం చెబుతోంది?
గరుడ పురాణం హిందూ ధర్మంలోని ప్రముఖ గ్రంథం ఇది. ఒక మనిషి పాప పుణ్యాలను, మరణానంతర జీవితాన్ని, ఆత్మ ప్రయాణాన్ని, పాప కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ వంటి అంశాలను వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి ఈ జన్మలో చేసే ప్రతి పని కూడా అతని తరువాతే జన్మపై ప్రభావం చూపిస్తుందని అంటుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే కఠినమైన ఫలితాలు తప్పవని గరుడ పురాణం స్పష్టంగా చెబుతోంది. గరుడ పురాణం అనేది కేవలం మరణానంతరం విషయాల గురించి తెలుసుకునే గ్రంథం మాత్రమే కాదు.. జీవించి ఉన్నప్పుడే మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా నేర్పించే ఒక నైతిక గ్రంథంగా చెప్పుకోవాలి.



ఈ పాపాలు చేస్తే రాబందు పుట్టుకే
గరుడ పురాణంలో కొన్ని రకాల పాపాల గురించి చెబుతారు. అలాంటి పాపపు పనులు చేస్తే వచ్చే జన్మలో నీచమైన రూపంలో పుట్టక తప్పదని గరుడ పురాణం చెబుతోంది. ముఖ్యంగా ఇతరులను మోసం చేసేవారు, నమ్మించి ద్రోహం చేసేవారు, అతి స్వార్థంతో జీవించేవారు, తమకన్నా బలహీనులను హింసించేవారు, అత్యంత పాపాత్ములుగా గరుడ పురాణం లెక్కిస్తుంది. వాటిని తీవ్రమైన పాపాలుగానే చెబుతోంది. ఈ పాపాలు చేసే వారికి ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా విముక్తి ఉండదు. ఈ రెండు జన్మల్లోనూ కష్టాలు పడక తప్పదని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. ఇలాంటి పాపాలు చేసేవారు వచ్చే జన్మలో రాబందుగా పుట్టే అవకాశం ఉందని అంటుంది గరుడ పురాణం. రాబందులు మృతదేహాలపై ఆధారపడి జీవించే పక్షులు ఇంతకంటే నీచ జనమైన జన్మ ఇంకొకటి ఉండదు.


Related posts