హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడు పోలేపాక ప్రభాకర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్ కు తరలించారు.
జరిగిన సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానసిక వికలాంగురాలిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Also Read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





