SGSTV NEWS online
Spiritual

భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!



Sankranti Special 2026: సంక్రాంతి మూడు రోజులు పాటించే ప్రతి పద్ధతి, సంప్రదాయం వెనుక మన జీవనశైలి, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఇమిడి ఉంటాయి. అందులో భాగమే సంధ్య గొబ్బిళ్లు…ఇవెందుకు పెడతారంటే..

Sankranti Gobbillu 2026:  సంక్రాంతి పండుగ ప్రారంభానికి  నెల ముందు నుంచే పండుగ శోభ మొదలైపోతుంది.  ధనుర్మాసం ప్రారంభంలోనే వేడుకలు, సంబరాలు ప్రారంభమవుతాయి. తెలుగు లోగిళ్లన్నీ రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. రంగులు నింపిన ముగ్గుల మధ్య గొబ్బిళ్లు చేసి వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి..పసుపు-కుంకుమతో గౌరీ దేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం కన్నె పిల్లలంతా ఈ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు.  గొబ్బి అనే మాట గర్భా అనే మాట నుంచి ఉద్భవించిందని చెబుతారు జానపద పరిశోధకులు.  గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. అందుకే గొబ్బెమ్మగా గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజిస్తారు.

సుబ్బీ గొబ్బెమ్మా సుఖములీయవేచామంతి పువ్వంటి చెల్లిల్నియ్యవేతామర పువ్వంటి తమ్ముడ్నీయ్యవేమొగలీ పువ్వంటీ మొగుడ్నియ్యవేఅంటూ సాగే గొబ్బి పాట కన్నెపిల్లల కోర్కెలను వారి భవిష్యత్ ను, పుట్టినిల్లు,మెట్టినింటి సౌభాగ్యాన్ని కోరుకునే ఆడపడుచుల మనసులు తెలియజేస్తుంది.

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళోకొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళోదండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళోపాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళోయేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళోదండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళోవెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళోఅంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య  శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుని, కంసుడిని వధించడం లాంటి  సాహసాలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు.

గొబ్బిపాటల్లో ఎక్కువగా గోవిందుడు, శ్రీకృష్ణుడి గురించి పురాణ కథలున్నాయి. గొబ్బిపాటల్లో కృష్ణుడిని ఉద్దేశించే ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లో కూడా గొబ్బిళ్ల ప్రస్తావన ఉంటుంది. ఇంకా అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు వియ్యపురాళ్ల పరువులు పట్టుదలలు, ఆప్యాతలు, అనుబంధాలు  ఇలా ఎన్నో విషయాలు ఈ గొబ్బిపాటల్లో ఉంటాయి.  రాయలసీమ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పాటేంటంటే గాజులు అమ్ముకునే వ్యాపారి కంచి వెళ్లి గాజులు తీసుకొస్తే..మహిళలంతా చేరి కంచి కామాక్షమ్మ గురించి అడిగి తెలుసుకోవడమే ఈ గొబ్బిపాటలోని ఇతివృత్తం.

గంగమ్మ గౌరమ్మ అప్పసెల్లెండ్రూ .. గొబ్బియళ్లో ..ఒక తల్లి బిడ్డలకు వైరమూ లేదు.. గొబ్బియళ్లోమంచి మంచి పూలేరి రాసులు పోసిరి…గొబ్బియళ్లో …అనే పాట ఎటువంటి వైరాలు వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి జీవనం సాగించాలనే ధర్మాన్ని బోధిస్తుంది.

గొబ్బియల్లో కంచికి పోయేటి గాజులశెట్టి గొబ్బియల్లో…గొబ్బయళ్ళో గొబ్బియని పాడరమ్మకంచి వరదరాజునే గొబ్బియళ్లోగొబ్బియళ్లో అంచులంచురగుల మదపంచవన్నె ముగ్గుల్లో గొబ్బియళ్లో… అనే పాటలో ముంగిట్లోని ముగ్గుల ప్రాముఖ్యాన్ని వాటికి దైవత్వాన్ని ఆపాదించడమూ కనిపిస్తుంది.

ఇంటి ముందు కళకళ లాడే ముగ్గు లను వర్ణిస్తూ వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తూగొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మకంచి వరద రాజునే గొబ్బియళ్ళోగొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీదపంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలెన్నో ఉన్నాయి. పట్టణాల్లో అరుదుగా కనిపించే ఈసంప్రదాయం..పల్లెల్లో అడుగడుగునా కనిపిస్తుంది…

మన హిందూ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసంలో సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయటం ఈ పండుగ ప్రత్యేకత. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయడంతో పాటు ఆ ముగ్గుల మీద ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టటం కూడా సంక్రాంతి పండుగ ప్రత్యేకత. తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు.

ఈ మూడు రోజులపాటు ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. అయితే ఇలా గొబ్బెమ్మలు పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఉంది. యువతులు ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి వాటిని రంగురంగుల పువ్వులతో, కుంకుమ పసుపు బొట్లతో అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు. ఇలా గొబ్బెమ్మలు పెట్టడం గోపికా స్త్రీల రూపాలకు సంకేతంగా భావిస్తారు. గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. రంగుల ముగ్గు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజున యువతులను గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేస్తారు. కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తు బాలికలు ఇలా గొబ్బెమ్మలు చేస్తారు.

అయితే ఇలా గొబ్బెమ్మలు చేయటానికి శాస్త్రీయ పరంగా కూడా ప్రధానమైన కారణం ఉంది. సాధారణంగా గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారుచేస్తారు. ఇంటి ముందు లోగిళ్ళలో ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఇంట్లోకి సుష్మక్రియలు ప్రవేశించకుండా ఉంటాయని శాస్త్రపరంగా నిరూపణ అయింది. హిమమంతా చివరి రోజులు కాబట్టి సూక్ష్మ క్రిములు లో గాలిలో సంచరిస్తూ ఉంటాయి. ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారుచేసి ఇంటి ముందు పెట్టడం వల్ల అవి ఆంటీబయాటిక్ గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందువల్లే భోగి పండుగ రోజు వేసే భోగి మంటలలో కూడా ఆవు పేడతో తయారుచేసిన పిడకలను వేస్తారు.

Related posts