ఉదయాన్నే రైతులు తమ పనులు చేసుకునేందుకు పొలాలకు పయనమయ్యారు. కానీ వారంతా ఓ కూడలి దగ్గరకు చేరుకున్నాక.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
అప్పుడే తెల్లవారింది. జనం పనుల్లో బిజీ అవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రెడి అవుతున్నారు. కానీ.! ఆ రోడ్డుపైన వెళ్లినవారి భయంతో మళ్ళీ వెనక్కి వచ్చారు. రోడ్డుపై ఎటు చూసినా పసుపు.. కుంకుమ.. నిమ్మకాయలు.. వివిధ రకాల బొమ్మలు.. ఇక్కడ.. ఏదో చేశారనే చర్చ సాగింది. అలా ఎందుకు చేశారు. !ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని నీరుకుల్ల గ్రామానికి వెళ్లే రోడ్డుపై క్షుద్రపూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. జిల్లేడు, మోతుకు, బొమ్మిడి మూడు రకాల ఆకులతో విస్తారాకు తయారు చేసి.. అందులో అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి.. నిమ్మకాయ, కోడిగుడ్డు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే పంట పొలాల ప్రాంతాల్లో ఈ క్షుద్రపూజలు చేయడం పట్ల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆది, గురువారాల్లో రాత్రిపూట క్షుద్రపూజలు నీరుకుల్ల రోడ్డులో ఎక్కువగా చేస్తున్నారు భూతవైద్యులు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిపై నుంచి తిప్పి.. వీటిని మూడు, నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డుపై పెడుతున్నారని రైతులు అంటున్నారు. అయితే ఇలాంటి దృశ్యాలు చూసి రైతులు భయపడుతున్నారు. ఉదయం పూట వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను నమ్మొద్దని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.
Also Read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




