Rangareddy: రంగారెడ్డి జిల్లాలో పట్టపగలు జరిగిన ఓ భారీ దోపిడీ ప్రయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం, సత్యనారాయణ కాలనీలో ఉన్న ఒక గోల్డ్ షాపులో దుండగుడు నకిలీ తుపాకీతో హల్చల్ చేశాడు.
సత్యనారాయణ కాలనీలోని జ్యువెలరీ షాపులోకి ఒక వ్యక్తి కస్టమర్లా ప్రవేశించాడు. లోపలికి రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న నకిలీ తుపాకీని బయటకు తీసి షాపు యజమానిని బెదిరించాడు. షాపులోని. నగలను ఇవ్వాలని హుకూం జారీ చేశాడు. అయితే.. యజమాని ఏమాత్రం భయపడకుండా దొంగను ప్రతిఘటించాడు. యజమాని తనను ఎదిరించడంతో కంగారుపడ్డ దొంగ.. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో యజమానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
యజమాని అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు ప్రతిఘటించడంతో.. తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని దొంగ గ్రహించాడు. దీంతో భయపడిన నిందితుడు తన వద్ద ఉన్న నకిలీ తుపాకీని అక్కడే పడేసి.. కొన్ని బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. ఈ దాడిలో షాపు యజమాని తలకి, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుడు వదిలి వెళ్ళిన నకిలీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షాపులోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. దొంగతనం జరిగిన తీరు, నిందితుడి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలే జనావాసాల మధ్య ఇలాంటి ఘటన జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
- అమానుషం.. అంగన్వాడి టీచర్ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?
- హోమ్ వర్క్ చేయలేదని ఇంత దారుణమా..? రెండో తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం..!
- పైలట్ అవుదామని కోటి ఆశలతో హైదరాబాద్కు.. ట్యూటర్ చేసిన దారుణంతో..
- చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి





