కుమారుడిని కడతేర్చిన తండ్రి
మెదక్ జిల్లాలో దారుణం
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.
ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.
Also Read
- ప్రేమ.. పెళ్లి.. కోటి రూపాయల మోసం! భార్యపై భర్త, అత్తింటి వారి దారుణ దాడి
- రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర
- సహజీవనం.. మహిళ నాలుక కోసి పారిపోయిన ప్రియుడు
- ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!
- కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!





