సంకష్టహర చతుర్థి: సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనపడుతుంది. అలాగే చాలా మంది వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్ధి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.
సంకష్టహర చతుర్థి: సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని ప్రత్యేకించి పూజిస్తాము. ప్రతి నెలా కూడా కృష్ణ పక్షంలో, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజున వినాయకుని ఆరాధించడం వలన అడ్డంకులు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.
సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనపడుతుంది. అలాగే చాలా మంది వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్ధి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు.
సంకష్టహర చతుర్థి ముహూర్తం
పంచాంగం ప్రకారం చతుర్థి తిధి డిసెంబర్ 7 సాయంత్రం 6:24కి మొదలవుతుంది. డిసెంబర్ 8న వినాయకుడిని సంకష్టహర చతుర్థి నాడు సాయంత్రం గరికతో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీన చంద్ర దర్శనం తర్వాత వినాయకుడిని ఆరాధించాలి.
సంకష్టహర చతుర్థి పూజా విధానం
👉 ఉదయాన్నే తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
👉 ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
👉 వినాయకుడికి పువ్వులు, గరికను సమర్పించండి.
👉 వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి.
👉 ధూప, దీప, నైవేద్యాలతో వినాయకుడిని ఆరాధించాలి.
👉 సాయంత్రం సంకష్ట వ్రత కథను చదివినా లేదా విన్నా మంచి ఫలితం ఉంటుంది.
👉 సాయంత్రం చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాత ఉపవాసాన్ని ముగించాలి.
👉 సంకష్టహర చతుర్ధి వ్రతాన్ని మూడు, ఐదు, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తే మంచిది.
👉 సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి. అలా కుదరకపోతే “ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని జపించండి
సంకష్టహర చతుర్థి నాడు ఎలాంటి దానాలు చేస్తే మంచిది?
సంకష్టహర చతుర్ధి నాడు పేదలకు గోధుమలు, బియ్యం, పప్పులు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే పండ్లు, స్వీట్లు, దుస్తులు, దుప్పట్లు, నెయ్యి వంటివి కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. దానం చేసిన ఫలితం కలగాలంటే చేసిన దానం గురించి ఎవరికీ చెప్పుకోకూడదు. రహస్యంగా దానం చేయాలి.
