మహబూబ్ నగర్ జడ్చర్ల : గురుకుల పాఠశాలకు చెందిన మహిళ వైస్ ప్రిన్సిపాల్ పదవతరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించిన సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళ్లితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అదే కళాశాలలో పని చేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న విషయం ఇటీవల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం నిర్వహించిన అవేర్ నెస్ ప్రోగ్రాంలో వెలుగులోకి వచ్చింది. బాడ్ టచ్.. గుడ్ టచ్ తదితర వివరాలను గురించి కళాజాత బృందం అవగాహన కలిగించిన సందర్భంలో పాఠశాలకు చెందిన విద్యార్థినీలు వైస్ ప్రిన్సిపల్.. పదవ తరగతి విద్యార్థిని నీ లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని తెలియజేశారు. బాధిత బాలికను అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ వివరాలు అడగగా.. ప్రతిరోజు రాత్రి సమయంలో మహిళా వైస్ ప్రిన్సిపల్ చేస్తున్న ఆగడాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ మేరకు బాలిక తల్లి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్ ను అడగ్గా విషయాన్ని బయటకు చెప్పొద్దు అని , అలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించినట్లు బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బాలికను జిల్లా కేంద్రంలోని బాలల సంక్షేమ మండలిలోకి తీసుకువచ్చారు. గురువారం ఈ విషయం పై బాలిక చెప్పిన వివరాలు అన్నింటిని పోలీసులు నమోదు చేసుకున్నారు.గురువారం సాయంత్రం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి మరి నీ వివరాలు సేకరించారు. సిబ్బందిని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు పిలిపించి మరిన్ని వివరాలను సేకరించారు. వైస్ ప్రిన్సిపాల్ బాలికతో మొదటి నుండి సన్నిహితంగా ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా పోర్న్ వీడియోలు చూపుతూ.. అమ్మ.. నాన్నల ఆట ఆడుకుందాం అంటూ బాలికపై అసభ్యకరమైన రీతిలో వ్యవహరించినట్లు బాధిత బాలికతో పాటు.. పలువురు విద్యార్థినిలు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు పోలీసులు వైస్ ప్రిన్సిపల్ పై ఫోక్సో కేసు నమోదు చేసి గురువారం అరెస్టు చేశారు. విషయము బయటకు పొక్కకుండా బాలిక తల్లిదండ్రులను భయపెట్టే విధంగా వ్యవహరించినందుకు పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు దిశ కు తెలిపారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Also Read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





