SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు



APSRTC Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తర్వాత, ఆర్టీసీ బస్సుల్లో సీటు గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిపై మహిళలు దాడి చేశారు. ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని మరి కొట్టారు. తాము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావా అంటూ తోటి ప్రయాణికుడితో మహిళలు ఘర్షణకు దిగారు. కాకినాడ జిల్లా తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఘటన చోటుచేసుకుంది.

బస్సు రద్దీగా ఉండటంతో ఇద్దరు మహిళలు తమ కర్చీఫ్లు ఒక సీటుపై వేసుకున్నారు. ఇది బస్సుల్లో సాధారణంగా చూసే అసాధారణ ‘సీటు బుకింగ్’ పద్ధతి. అయితే కొంతసేపటి తర్వాత, ఓ వ్యక్తి ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో మహిళలు కోపంతో అతనితో వాగ్వాదానికి దిగారు. “మేము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావు?” అని ప్రశ్నించారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది.

వాగ్వాదం మరింత పెరిగిన తర్వాత, మహిళల్లో ఒకరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టడం మొదలెట్టారు. మరో మహిళ కూడా చేరి, అతనిపై దాడి చేసింది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు మొబైల్తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం X లో వైరల్ అవుతుంది.

అయితే ఈ వీడియో పై రియాక్ట్ అయ్యి చాలా మంది ప్రజలు ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల సీటు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా బస్సులో పురుషులకు, మహిళలకు సమాన హక్కు ఉండాలి. మొత్తం వారే సీట్లు ఆక్రమిస్తున్నారు. మేము డబ్బులు కట్టి కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని పురుషులు విమర్శిస్తున్నారు. దీనిపై అందరికి సమ న్యాయం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read

Related posts