SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

Viral News: ఖాకీ అనుకుంటే పొరపాటే.. యమకంత్రి.. మనోడి వేషాలు తెలిస్తే..



ఈజీ మనీకి అలావాటు పడిన ఓ యువకుడు పోలీసు ఆఫీసర్ అవతారమెత్తాడు.ఖాకీ యూనిఫాం ధరించి సీఐగా మారిపోయాడు.ఇక తనదే రాజ్యం అన్నట్టు..ఓ ఫ్యామిలీ గొడవలోకి దూరాడు. కానీ కాసేపటికే అడ్డంగా బుక్కై నిజమైన పోలీసులకు చిక్కిపోయాడు.ఇంతకు అతనెలా దొరికిపోయాడో తెలుసుకుందాం పదండి.

ఈజీ మనీకి అలావాటు పడిన ఓ యువకుడు పోలీసు ఆఫీసర్ అవతారమెత్తాడు.ఖాకీ యూనిఫాం ధరించి సీఐగా మారిపోయాడు.ఇక తనదే రాజ్యం అన్నట్టు..ఓ ఫ్యామిలీ గొడవలోకి దూరాడు. కానీ కాసేపటికే అడ్డంగా బుక్కైయ్యాడు. వివరాల్లోకెళ్తే చంద్రగిరి మండలం భాకరా పేటలో నకిలీ సీఐను అరెస్ట్ చేసిన పోలీసులు అతని బండారాన్ని బయటపెట్టారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పెద్ద కాంపల్లికి చెందిన 33 ఏళ్ల శివయ్య అలియాస్ శివకుమార్‌ అనే వ్యక్తి పోలీస్ వేశం వేసుకొని జనాల నుంచి డబ్బులు కాజేస్తున్నట్టు గుర్తించారు.

జంగావాండ్ల పల్లిలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం శివకుమార్ తాను కడప ఎస్బీ సీఐగా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ వారితో బంగారం కొట్టేశాడు. అతని తీరుపై బాధిత ఫ్యామిలీకి అనుమానం రావడంతో వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.బాధితుల ఫిర్యాదుతో అతనిఐ నిఘా పెట్టిన పోలీసులు శివకుమార్ ఫేక్ పోలీస్ అని తెలుసుకున్నారు.

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఖాకీ యూనిఫాంలోనే ఉన్న శివకుమార్ ను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.దర్యాప్తులో భాగంగా శివకుమార్ చిట్టాలను బయటకు తీశారు. దీంతో ఇతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది మోసం చేసినట్టు గుర్తించారు. శివకుమార్‌పై పలు సెక్షల కింద కేసు నమెదు చేసి రిమాండ్‌కు తరించారు. పోలీసు లేక ఇతర శాఖల అధికారులమని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మోసాలకు పాల్పడితే డయల్ 112కు లేదంటే సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.

Also Read

Related posts